అక్రమాస్తులు లేవు... ఎలాంటి విచారణకైనా సిద్ధమే: బండారు సత్యనారాయణమూర్తి

  • అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులకు మించి ఇతర ఆస్తులు లేవు
  • వారసత్వంగా వచ్చిన భూముల్లో వ్యవసాయం చేస్తున్నా
  • అవంతి శ్రీనివాస్ ఆరోపణలు విచారకరం
తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని... వారసత్వంగా వచ్చిన భూములలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నానని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. 2009, 2014, 2019లలో ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులకు మించి తనకు ఇతర ఆస్తులు, సంపద లేవని చెప్పారు. తనకు, తన కుటుంబసభ్యులకు బినామీల పేరుతో ఆస్తులు లేవని అన్నారు. తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని తెలిపారు.

మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన ఆరోపణలు విచారకరమని... ఆధారాలు లేకుండా బురద చల్లడం తగదని చెప్పారు. ఆధారాలు ఉంటే ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని అన్నారు. అనవసరంగా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Go Back to Shorts
avanthi srinivas
bandaru satyanarayanamurthi
ysrcp
Telugudesam

More Telugu News